సుకుమార్‌లో కొత్త యాంగిల్‌ చూస్తారా

Teenmaar Mass Dance Performance By Director Sukumar
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ సినిమాకు కొత్త హంగులు అద్ది, తెలుగు సినిమా స్క్రీన్‌ప్లే స్థాయిని పెంచి తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్‌. టాలీవుడ్‌ మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్‌ ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో ‘రంగస్థలం’ అనే చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న రంగస్థలం చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా రామ్‌ లక్ష్మణ్‌లతో సుకుమార్‌ వర్క్‌ చేస్తున్నాడు. రామ్‌, లక్ష్మణ్‌లు టాలీవుడ్‌లో ఎంతటి ఫేమస్‌ స్టంట్స్‌ మాస్టర్స్‌ అనే విషయం తెల్సిందే. వీరిద్దరు సెట్స్‌లో ఉంటే చాలా సరదాగా ఉంటుందని అంతా అంటూ ఉంటారు.

‘రంగస్థలం’ షూటింగ్‌ సందర్బంగా చిన్న బ్రేక్‌ సమయంలో దర్శకుడు సుకుమార్‌తో కలిసి వీరిద్దరు వేసిన తీన్‌మార్‌ డాన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. రామ్‌ లక్ష్మణ్‌లు అప్పుడప్పుడు ఇలాంటి డాన్స్‌లు చేయడం అందరికి సుపరిచితమే. కాని మొదటి సారి సుకుమార్‌ను డాన్స్‌ చేస్తూ చూడటం, అదీ తీన్‌మార్‌ డాన్స్‌ అవ్వడంతో అంతా నోరెళ్ల బెడుతున్నారు. మాంచి జోష్‌తో రామ్‌ లక్ష్మణ్‌లకు పోటీగా సుకుమార్‌ తీన్‌మార్‌ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రామ్‌ లక్ష్మణ్‌లు ఈ వీడియోను తమ యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. సుకుమార్‌ స్టైప్పులకు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జనాలు ఫిదా అవుతున్నారు. మీరు ఈ వీడియోపై ఒక లుక్కేయండి.