ఒకప్పుడు క్లాస్ మూవీస్ తీస్తూ పకడ్బందీ స్క్రీన్ ప్లే తో స్టోరీస్ నరేట్ చేస్తూ సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువగా గ్యాప్ ఇస్తూ సుకుమార్ జర్నీ సాగింది. కాని ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ శైలి మారింది. వేగం బాగా బాగా పెరిగింది. పుష్ప2 తర్వాత మరో ఇద్దరు హీరోలతో సినిమాలు ఫిక్స్ చేసేసుకున్నాడు సుకుమార్.
పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు సుకుమార్. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా మూవీస్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం ప్యాన్ ఇండియా హీరోలతోనే సినిమాలు కమిట్ అయ్యాడు. ఫిబ్రవరి నుంచి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ లేదా నెక్ట్స్ ఇయర్ క్రిస్మస్ కు పుష్ప ది రూల్ రిలీజ్ అవుతుంది.
పుష్ప2 పూర్తైన తర్వాత సుకుమార్ ఇమిడియెట్ గా రౌడీ హీరో విజయ్ తో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పూర్తైన వెంటనే దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు రంగస్థలం కాంబినేషన్ మరోసారి రిపీట్ కావాల్సి ఉంది. ఈ బ్లాక్ బస్టర్ ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక్క సినిమా చేయాల్సి ఉంది.అయితే స్టోరీ లాక్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే విజయ్ దేవరకొండతో మూవీ కంప్లీట్ అయ్యేలోపు రామ్ చరణ్ కోసం స్టోరీ రెడీ చేస్తాడు సుకుమార్. ఆ తర్వాతే వీరిద్దరి కాంబోలో మూవీ పట్టాలెక్కుతుంది. రామ్ చరణ్ ఈలోపు తన చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేస్తాడు.