ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్‌స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్‌స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్‌కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు.
కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది.అలాగే ‘లవ్‌స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది.
కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్‌పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.