మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి

sumanth don't care about negative comments

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చినా హీరో సుమంత్, తన తాత అక్కినేని నాగేశ్వరావు గారి పేరు నిలపెడుతూ అప్పుడు అప్పుడు మంచి సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈయనకు స్టార్ హీరోగా మాత్రం బ్రేక్ రాలేదని చెప్పాలి. అయినా తన ప్రయత్నాలను మాత్రం మరవడం లేదు. తాజాగా సుబ్రమణ్యపురం అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విభినమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమంత్ సోషల్ మీడియాను తన సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కువగా వాడుతాడు పర్సనల్ విషయాలు అంతగా షేర్ చేసుకోడు. తాజాగా ఈయన గురించి కొందరు నీటిజన్స్ నెగటివ్ కామెంట్స్ పెట్టారు.

ఆ విషయంపై సుమంత్ మాట్లాడుతూ.. నెగటివ్ కామెంట్స్ గురుంచి అసలు పతిన్చుకోను అని, చాలామంది సోషల్ మీడియాలో బాద్యత లేకుండా ప్రవర్తిస్తారు అన్నారు ఇతరుల మనసులు గాయపరిచే లాగా కామెంట్స్ పెడుతుంటారు. అలంటి వారికీ నేను అసలు రిప్లయ్ ఇవ్వను అన్నారు. నామీద నెగటివ్ కామెంట్స్ పెడితే ఐ డోంట్ కేర్ అని సమాధానం ఇచ్చాడు. ఫేక్ అకౌంట్స్ తో ఇతరులను తిట్టడం కామెంట్స్ పెట్టి హింసించడం అనేది అనాగరికం అని అభిప్రయాపడ్డాడు. తన సినిమాల కోసం సోషల్ మీడియా ను ఉపయోగించక తప్పదు అన్నాడు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వలన ఇబ్బందులు పడుతున్నారు. రామ్ చరణ్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారికే సోషల్ మీడియా గురుంచి ఇబ్బందులు తప్పలేదు.