‘మళ్లీ రావా’పై కేసీఆర్‌కు అభిమానం ఎందుకు?

Sumanth gets request from KCR for print of Malli Raava movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సుమంత్‌ హీరోగా నటించిన ‘మళ్లీ రావా’ చిత్రం చాలా కాలం తర్వాత సక్సెస్‌ను దక్కించుకుంది. సుమంత్‌కు చాలా సంవత్సరాలుగా సక్సెస్‌ అంటే తెలియకుండా పోయింది. ఇన్నాళ్లకు సుమంత్‌కు సక్సెస్‌ రావడంతో అక్కినేని ఫ్యామిలీతో కాస్త సంతోషం వ్యక్తం అవుతుంది. ఫీల్‌ గుడ్‌ మూవీగా ‘మళ్లీ రావా’కు టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ కూడా బాగా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చూడాలనుకుంటున్నారు అంటూ సుమంత్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చిందట. కేసీఆర్‌ ఫ్యామిలీ కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని వారాంతంలో కేసీఆర్‌ ఫ్యామిలీ అంతా చూడాలనుకుంటున్నారు అంటూ సీఎంఓ నుండి సుమంత్‌కు కాల్‌ వచ్చింది.

కొన్నాళ్లుగా చాలా బిజీ రాజకీయాలతో తల మునకలు అయ్యి ఉన్న కేసీఆర్‌ ఒక సినిమా చూడాలని కోరుకున్నాడట. దాంతో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ఫీల్‌ గుడ్‌ మూవీగా పేరు తెచ్చుకున్న ‘మళ్లీ రావా’ చూడాల్సిందిగా ఎవరో సలహా ఇవ్వడం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ కూడా మళ్లీ రావా సినిమాను చూడాలనుకోవడం జరిగిందట. అందుకే స్వయంగా సీఎంఓ ఆఫీస్‌ నుండి సుమంత్‌కు కాల్‌ చేశారని సమాచారం అందుతుంది. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని చూడాలనుకోవడంతో సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. సుమంత్‌ సీఎం కుటుంబ సభ్యులు సినిమాను చూడాలనుకోవడం గొప్ప గౌరవం అంటూ ట్వీట్‌ చేశాడు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు సినిమా చూసేందుకు కమిట్‌ అయిన నేపథ్యంలో సినిమాకు ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మరి సీఎం ‘మళ్లీ రావా’ యూనిట్‌ సభ్యులపై, చిత్రంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.