కోహ్లీ పెళ్లికి స‌చిన్, యువ‌రాజ్ కు మాత్ర‌మే ఆహ్వానం

Kohli and anushka sharma marriage Sachin and Yuvraj only invited

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కోహ్లీ-అనుష్క పెళ్లి… సోష‌ల్ మీడియాలో, న్యూస్ చాన‌ళ్ల‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. కోహ్లీ కుటుంబ స‌భ్యులు కానీ, అనుష్క శ‌ర్మ కుటుంబం కానీ.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ చేయ‌న‌ప్ప‌టికీ.. ఈ నెల 12న వారి వివాహం జ‌ర‌గ‌నుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు తెర‌ప‌డ‌డం లేదు. మ‌న‌దేశంతో పాటు..ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోహ్లీ పెళ్లి గురించి తెలుసుకోడానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే 12వ తేదీన ఇట‌లీలోని మిలాన్ లో జ‌రిగే వేడుక‌పై భిన్నాభిప్రాయం కూడా ఉంది. ఆ రోజు వారిద్ద‌రి వివాహం కాద‌ని… నిశ్చితార్థం మాత్రమే జ‌రగునుంద‌ని కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తానికి పెళ్లి కానీ, నిశ్చితార్థం కానీ ఏదో ఒక వేడుక‌ జ‌రగునుంద‌న్న చ‌ర్చ నేప‌థ్యంలో విరాట్ కుటుంబ స‌భ్యులు, ఆయ‌న స‌న్నిహితులు, చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శ‌ర్మ ఇప్ప‌టికే మిలాన్ చేరుకున్నారు.

కార్య‌క్ర‌మం ముగిశాక దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని, ఇండియాకు తిరిగి వ‌చ్చాక ఈ నెల 21 లేదా 22న ప్ర‌ముఖుల‌కు ముంబైలో భారీ విందు ఏర్పాటుచేస్తార‌ని వార్త‌లొస్తున్నాయి. అటు మిలాన్ లో జ‌రిగే వేడుక‌కు విరాట్ త‌ర‌పున కేవ‌లం ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు మాత్ర‌మే ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, యువ‌రాజ్ సింగ్ ను మాత్ర‌మే కోహ్లీ పెళ్లికి పిలిచిన‌ట్టు స‌మాచారం. అటు అనుష్క కూడా షారూఖ్ ఖాన్, అమిర్ ఖాన్, ఆదిత్య చోప్రా, డైరెక్ట‌ర్ మ‌నీశ్ శ‌ర్మ ను ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. డిసెంబ‌రులో విరాట్, అనుష్క వివాహం జ‌రిపించాల‌ని నాలుగు నెల‌ల క్రిత‌మే ఇరు కుటుంబాలు నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని, కావాల‌నే ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.