సూర్యుడు కూడా లాక్‌డౌన్‌లోకి.. కారణమదే..

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉంది. దీంతో విశ్వంలో కూడా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్‌లో ఉండి ఓ విషయాన్ని గమనించారో లేదో గానీ ఈసారి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అంతగా లేవు. అందుకు కారణం సూర్యుడిపై నిరంతరం జరిగే కేంద్రక సంలీన చర్యలు మందకొడిగా సాగుతున్నాయట. దీంతో ‘సన్‌ స్పాట్స్‌’ సంఖ్య తగ్గిపోయాయి.
దీన్నే ‘సోలార్‌ మినిమమ్‌’ అంటారు. దీన్ని నెటిజన్లు ఫన్నీగా ‘సూర్యుడు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాడు’ అని పిలుస్తున్నారు. సోలార్‌ మినిమమ్‌ కారణంగా సూర్యునిపై అయస్కాంత క్షేత్రాలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా సౌర కుటుంబంలోకి కాస్మిక్‌ కిరణాలు విస్తరిస్తాయి. దీంతో ఈ కిరణాల ప్రభావంతో పిడుగులతో కూడిన తుఫాన్లు సంభవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
అంతేకాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు కూడా ప్రమాదమేనని చెప్తున్నారు. కాగా 1790-1830ల మధ్య నమోదైన అతి శీతల ఉష్ణోగ్రతలకు ‘సోలార్‌ మినిమమ్’ చర్యే కారణమని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి ఈ చర్య జరుగుందని… అయితే ప్రమాదం తీవ్రత ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని శాస్త్రవేత్తల ఉవాచ.