Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కమెడియన్‌గా చాలా కష్టపడి స్టార్ కమెడియన్ అయిన సునీల్ కొంత కాలంకే హీరోగా అవకాశాలు రావడంతో గత కొన్ని సంవత్సరాలుగా హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల సునీల్ హీరోగా చేసిన దాదాపు అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో హీరోగా ఇక ప్రయత్నాలు వద్దని నిర్ణయించుకున్నాడు. మళ్లీ కమెడియన్‌గా సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాడు. కమెడియన్‌గా సునీల్ చేతిలో ప్రస్తుతం అయిదు సినిమాలు ఉన్నాయి. ఆ అయిదు సినిమాలు సక్సెస్ అయితే తప్ప సునీల్ కెరీర్ కొనసాగడం కష్టం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సునీల్ కమెడియన్‌గా నటిస్తున్న చిత్రాల్లో మొదటిది చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో సునీల్ కీలకమైన కమెడియన్ రోల్లో కనిపించబోతున్నాడు. ఆ తర్వాత అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో సునీల్ రెండవ హీరోకు సమానమైన పాత్రను చేయబోతున్నాడు. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మూవీలో సునీల్‌ను కమెడియన్‌గా ఎంపిక చేయడం జరిగింది. ఈ మూడు సినిమాలతో పాటు రవితేజ, శ్రీనువైట్ల కాంబో మూవీలో మరియు తేజ, వెంకటేష్‌ల కాంబో మూవీలో కూడా సునీల్ కమెడియన్‌గా నటించబోతున్నాడు. ఈ అయిదు సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ సునీల్ కమెడియన్‌గా స్టార్డంను దక్కించుకోవడం ఖాయం.