హ్యాట్సాఫ్‌… సన్నీలియోన్‌

Sunny leone again adoptse Twin Boys

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మాజీ పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ గత కొంత కాలంగా బాలీవుడ్‌ సినిమాలకు పరిమితం అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా, మోస్ట్‌ వాంటెడ్‌ ఐటెం గర్ల్‌గా మారిపోయిన సన్నీలియోన్‌ ప్రస్తుతం తన మంచి మనస్సుతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంటుంది. గత సంవత్సరం ఒక చిన్నారిని దత్తత తీసుకుని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సన్నీలియోన్‌ దంపతులు తాజాగా కవల పిల్లలను దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించారు. సోషల్‌ మీడియాలో తాజాగా వీరు పోస్ట్‌ చేసిన ఫొటో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆమె అభిమానుల సంఖ్యను పెంచుతుంది.

మొదట పాపను దత్తత తీసుకున్న సన్నీ దంపతులు తాజాగా మగ కవల పిల్లలను దత్తత తీసుకున్నారు. పిల్లలు లేరు అని బాధపడటం కంటే ఇలా అనాధ పిల్లలను దత్తత తీసుకుని, వారి ఆలన పాలన చూడటం వల్ల నలుగురికి మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది. అందుకే సన్నీలియోన్‌ను ఆమె సన్నిహితులు మరియు అభిమానులు అంతా కూడా హ్యాట్సాఫ్‌ సన్నీలియోన్‌ అంటున్నారు. ఇలా పలువురు స్టార్స్‌ కూడా దత్తత మార్గంను అనుసరించాలని, అలా చేస్తే అనాధ అనే వారే ఉండరు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్నీలియోన్‌ చేసిన ఈ పనిని మంచి మనస్సుతో అంతా కూడా అభినందించాలి. సన్నీ దంపతుల మాదిరిగా అంతా కూడా ఇలాగే వ్యవహరించాలని పలు స్వచ్చంద సంస్థల వారు కోరుతున్నారు.