Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సన్నీలియోన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియంలో సన్నీ మైనపు విగ్రహం ఆవిష్కరించనున్నారు. మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన నిపుణులు లండన్ నుంచి వచ్చి ముంబైలో సన్నీలియోన్ ను కలిశారు. సన్నీకి సంబంధించిన కొలతలు తీసుకున్నారు. మేడమ్ టుస్సాడ్స్ లో తన ప్రతిరూపం పెడుతుండడంపై సన్నీ సంతోషం వ్యక్తంచేసింది. తాను ఎంతో థ్రిల్ కు గురయ్యానని చెప్పింది.
టుస్సాడ్స్ టీంకు కృతజ్ఞతలు తెలిపింది. ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని, మ్యూజియంలో తన ప్రతిరూపాన్ని చూసేందుకు తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని సన్నీలియోని తెలిపింది. ఆరేళ్లక్రితం పోర్న్ స్టార్ నేపథ్యంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీలియోనికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ముంబైలో ఆమె నివసించేందుకు అద్దె ఇల్లు కూడా దొరకలేదు.
ఎందరో ఆమెను హేళన చేస్తూ మాట్లాడారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే సన్నీలియోన్ బాలీవుడ్ తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇక్కడే హీరోయిన్ గా స్థిరపడింది. అయినప్పటికీ ఆమెకు అవమానాలేమీ ఆగిపోలేదు. న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో సన్నీలియోన్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరగడంతో ఆ ఈవెంట్ ను రద్దుచేయాల్సి వచ్చింది. అలాంటివాటినన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది సన్నీ. ముంబైలో ఇల్లు దొరకని స్థితినుంచి ఇప్పుడు నరేంద్రమోడీ, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, హృతిక్ రోషన్, సచిన్, కపిల్ దేవ్, సల్మాన్ ఖాన్ తదితరుల సరసన మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు బొమ్మ పెట్టించుకునే స్థాయికి ఎదిగింది.