‘సంక్రాంతికి క‌లుద్దాం’ అంటున్న సూపర్ హిట్ కాంబో..?

Super hit combo called 'Sankranti Kaluddam'..?
Super hit combo called 'Sankranti Kaluddam'..?

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టుల్లో విక్ట‌రీ వెంక‌టేశ్, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా కూడా ఒక‌టి. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ‘ఎఫ్‌-2’, ‘ఎఫ్-3’ మూవీ లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోతున్న మూడో మూవీ ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే, ఈ ప్రాజెక్టుకి సంబంధించి సినీ స‌ర్కిల్స్ లో ఒక క్రేజీ ఇన్ఫో విన‌బ‌డుతుంది . అనిల్ రావిపూడి, వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో రాబోతున్న మూవీ కి ఒక ఆస‌క్తిక‌ర టైటిల్ ని ఫిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రాబోతున్న ఈ మూవీ కు ”సంక్రాంతికి క‌లుద్దాం” అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నార‌ట‌. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ఉంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారంట .

Super hit combo called 'Sankranti Kaluddam'..?
Super hit combo called ‘Sankranti Kaluddam’..?

దీంతో వెంక‌టేశ్ నుంచి మ‌రోసారి కుటుంబ క‌థా మూవీ రాబోతుంద‌ని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇక ఈ మూవీ లో అందాల భామ‌లు మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీ ను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ని సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.