సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం అందరూ స్టార్ హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి మీరెప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేస్తున్నారు? అని జర్నలిస్ట్ అడగ్గా.. ‘బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు తీసినా చాలు. ఇప్పుడు తెలుగు చిత్రాలను ప్రపంచమంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోంది అదే.
అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు అంటూ తనదైన పంచ్ డైలాగ్‌తో ఆన్సరిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలె బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రీసెంట్గా తాను తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాళ్లకు మహేష్ సైలెంట్‌గా కౌంటర్ వేశారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.