పెట్ట ట్రైల‌ర్‌ తో అంచ‌నాలు పెంచేస్తోన్న ర‌జ‌నీకాంత్‌

Superstar Rajinikanth Petta Movie Official Trailer

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘పెట్టా’ చిత్రాన్ని ‘పేట’ పేరుతో తెలుగులో వల్లభనేని అశోక్‌ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పిజ్జా, జిగర్తాండ చిత్రాలను రూపొందించిన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ రజనీ కాంత్‌ కి వీరాభిమాని. ఆయన రజనీ ఫ్యాన్ బేస్ ని ఆధారం చేసుకుని తాజాగా పెట్ట  చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ లో ర‌జనీకాంత్ లుక్ స‌రికొత్తగా ఉండ‌డంతో అభిమానులు పేట మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. భారీ స్థాయిలో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తుండ‌గా తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. పేటా చిత్రంలో రజనీ అభిమానులను ఆకట్టుకొనే అంశాలు చాలానే ఉన్నాయ‌ట‌.

Rajinikanth Petta Movie Release Date Confirmed

త్రిష గ్లామర్‌, సిమ్రన్‌ అభినయం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంద‌ని ఈ సినిమాలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. అలాగే తొలిసారి కన్నడలో అనువాదం అవుతున్న రజనీ సినిమా ఇదే. అదీకాక బాషా తర్వాత సంక్రాంతికి విడుదలవుతున్న రజనీ చిత్రం ఇదే కావడం మరో కొసమెరుపు. ఈ చిత్రంలో రజనీకాంత్‌, త్రిష, సిమ్రాన్‌, సేతుపతి, బాబీ సింహ, నవాజుద్దీన్‌ సిద్దికి, మాళవిక నాయర్‌, మేఘా ఆకాష్‌ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్ మీద ఒక లుక్కేసేయ్యండి మరి.