కాస్త ఆలస్యంగా పెట్టా…!

Rajinikanth Petta Movie Release Suspense

రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష కథానాయకలుగా రజినీకాంత్ సరసన నటిస్తున్నారు. తెలుగు తమిళంలో ఒకేసారి విడుధలచేయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలవుతుంది. కానీ తెలుగులో ఈ చిత్రం విడుధలపైన అనుమానాలు ఉన్నాయి. తెలుగులో ఈ సంక్రాంతికి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు సిద్దంగా ఉన్నది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం కూడా ఒక్క రోజు ముందుగా విడుధలవ్వుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 కూడా సంక్రాంతికి సిద్దంగా ఉన్నది.

అవ్వని భారీ బడ్జెట్ చిత్రాలే కావున వీటి మద్య గట్టి పోటి ఉండే అవకాశం ఉన్నది. కావున పెట్టా సినిమా సంక్రాంతికి కాక్కుండా ఓ రెండు వారలు లేట్ గా విడుడుధలవ్వుతుంది. పెట్టా సినిమా భారీ బడ్జెట్ తో కూడిన సినిమా తెలుగు సినిమాలతో పోటి పడి రిలీజ్ చేస్తే ఒప్పెనింగ్స్ రావడం కాస్త కష్టంగా ఉంటుంది. కావునా ఓరెండు వారలు పోస్ట్ పోను చెయ్యాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కానీ తమిళంలో పెట్టా విడుదలలో ఎటువంటి మార్పు లేదు. అక్కడ పెట్టా పొంగల్ కు వస్తుంది. ఈ చిత్రంపైన రజినీకాంత్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తరువాత మురగదాస్ తో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నది.