ఈ నెల 7న ‘ఆ నలుగురు’ నిందితులకు మరణ శిక్ష

ఈ నెల 7న 'ఆ నలుగురు' నిందితులకు మరణ శిక్ష

అప్పట్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యోదంతం దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలించిన సంగతి మనకు తెలిసిందే. కాగా నిర్భయ హత్య కు కారణమైన నలుగురు నిందితులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ క్షమాభిక్షను కూడా నిరాకరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ నలుగురు నిందితులను ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. కాగా ఈ నెల 7న వీరికి మరణ శిక్ష కి సంబందించిన వారెంట్ వెలువడనున్న నేపథ్యంలో, ఆ నలుగురు నిందితులను ఒకే సారి ఉరి తీయాలని జైలు అధికారులు భావిస్తున్నారు.

కాగా ప్రస్తుతానికి తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటినుండి నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈమేరకు పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఉరికి సంబందించిన పనుల్లో మునిగిపోయారు. అయితే నిర్భయ హత్యకు కారణమైన నిందితుల మరణ శిక్షకు దేశమంతా కూడా ఎదురు చూస్తుంది…