వీవీప్యాట్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. అర్థంలేని పిటిషన్ అని పేర్కొంది. చెన్నైకు చెందిన టెక్ ఫర్ ఆల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులు వందశాతం సరిపోయేలా చూడాలని కోరుతూ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను నేడు విచారించిన జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్దారునిపై ఆగ్రహాం వ్యక్తచేస్తూ ఈవ్యవహారంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని విస్తత్ర ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెలువరించినందున తాము జోక్యం చేసుకోలేమని మిశ్రా ధర్మాసనం పేర్కొంది. సీజేఐ తీర్పును తాము అధిగమించలేం. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని, ఇది అర్థంలేని పిటిషన్ అని పేర్కొంటూ కొట్టివేసింది.