వరుసగా రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటమే లక్ష్యంగా రీ ఎంట్రీపై సురేష్ రైనా దృష్టి పెట్టాడు. ఏ మాత్రం ఆశలు వదలకుండా క్రికెట్ జట్టులో మళ్లీ చోటు కొరకి ప్రయత్నం చేస్తున్నాడు.
మోకాలికి సర్జరీ అయిన కూడా ఆ సీనియర్ ఆటగాడు నంబర్-4లో తనను పరీక్షించాలని, ఆడగలను, గతంలో నాకు ఆడిన అనుభవం ఉంది అని చెప్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2020, 2021ల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని అన్నాడు.
విజయ్ శంకర్, అంబటి రాయుడు, రిషభ్ పంత్‌లను నాల్గో స్థానంలో పంపినా రాణించలేక పోయారు. దీనితో నాల్గో స్థానం కోసం టీం ఇండియా అన్వేషణలో ఉంది. దాదాపుగా రెండు సంవత్సరాల నుండి ఈ స్థానం లో ఎవరు రాణించక టీమిండియా పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. 32 ఏళ్ల రైనా యో-యో టెస్టును కూడా పాస్ అవ్వాల్సి ఉంది.
వచ్చే వరల్డ్ టీ20 జట్టులో రైనాకి అవకాశం ఉండాలంటే దేశవాళీ టోర్నీల్లో నిరూపించుకోవాలి. స్టార్ ప్లేయర్ గా పేరొందిన రైనా తనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరాడు. ప్రస్తుతం రిషభ్. శ్రేయస్‌లు నాలుగో స్థానం లో ఉన్నారు.