తమిళ హీరో సూర్య కి తమిళంతో పాటు తెలుగులో కూడా అదే స్థాయి లో అభిమానులు ఉన్నారు. ఇప్పటికి సూర్య నుండి సినిమా వస్తుందంటే టాలీవుడ్ అంతా ఆసక్తిగా చూస్తుంది. సింగం-3 తర్వాత సూర్య నటిస్తున్న 36 వ చిత్రం ‘ఎన్జీకే’. నంద గోపాలం కుమారం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ మరియు సాయి పల్లవి లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తుండగా, డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఈ చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో సూర్య పొలిటికల్ లుక్ లో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన తొలి పోస్టర్ లో క్యూబా విప్లవకారుడు చే గువేరా లుక్ లో కనిపించిన సూర్య, ఈసారి మాత్రం పొలిటికల్ లుక్ లో కనిపిస్తుండడం తో పలువురు పలువిధాలుగా సినిమా కథని ఊహిస్తున్నారు. సినిమాకి సంబంధించిన వరకు దర్శకుడు సెల్వరాఘవన్ ఫామ్ లో లేడనే చెప్పాలి. కానీ, తన నుండి వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. సెల్వరాఘవన్ 2013 లో తాను తీసిన వర్ణ సినిమా ప్లాప్ అవ్వడంతో తీవ్రంగా విభ్రాంతికి గురయ్యి ఇకనుండి సినిమాలు తీయమని ప్రకటించి, సరిగ్గా 5 సంవత్సరాలకి సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ లో విడుదల చేసి, సినిమాను జనవరి 26 న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాకి సంగీతం సెల్వ రాఘవన్ ఆస్థాన సంగీత దర్శకుడైన యువన్ శంకర్ రాజా అందిస్తున్నాడు.