Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ హీరో సూర్య విభిన్నమైన వ్యక్తి. హీరో గా ప్రత్యేక కథాంశాలతో తెరపై సినిమా తీయడంలోనే కాదు…తెర వెనకా ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. తమిళనాడులో తాజాగా తనపై తలెత్తిన వివాదంపై ఆయన స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే..సన్ మ్యూజిక్ లో ప్రసారమయ్యే ఫ్రాంకా సొల్లటా కార్యక్రమంలో యాంకర్లు నివేదిత, సంగీతలు సూర్య ఎత్తు గురించి సరదా కామెంట్ చేశారు. అమితాబ్ బచ్చన్ తో సూర్య నటించాలంటే కుర్చీ వేసుకోవాలని వారు అన్నారు. వారి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పలువురు సినీ ప్రముఖులు, సూర్య అభిమానులపై ఈ కామెంట్ పై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ కొందరు అభిమానులు యాంకర్లను బెదిరిస్తూ పోస్టులు, కామెంట్లు చేశారు. ఈరోడ్, నమ్మకల్ ప్రాంతానికి చెందిన మరికొందరు అభిమానులు సన్ టీవీ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు. అభిమానుల తీరుపై సూర్య ట్విట్టర్ లో స్పందించారు. దయచేసి మీ విలువైన సమయాన్ని, శక్తిని ఉపయోగపడే పనుల కోసం వెచ్చించండి. సమాజానికి అవసరమయ్యే పనులు చేయండి అని ట్వీట్ చేశారు.
అన్బానా ఫ్యాన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడంతో పరోక్షంగా సూర్య తన అభిమానులను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు. వివాదం పెద్దగా మారకముందే స్పందించి…సూర్య తాన బాధ్యత గల నటుణ్ణి అనిపించుకున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. తనపై వచ్చిన కామెంట్లను పట్టించుకోకుండా…అదే సమయంలో ఫ్యాన్స్ హర్టవుకుండా..పరోక్ష ట్వీట్ తో హుందాగా వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు.