Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
survey on 2019 eletions ycp wins 2024
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఓ జాతీయ సర్వే సంస్థ ప్రకటన వైసీపీ నాయకులు, సానుభూతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆ సర్వే లో ఇంకోసారి వైసీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుందని తేలడంతో వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఉలిక్కి పడుతోంది. ఓ గొప్ప వెబ్ సైట్ అయితే ఆ సర్వే సారాన్ని జీర్ణించుకోలేక రంకెలేసింది. హౌ,హౌ అంటూ ఓ వైసీపీ కార్యకర్తలా సీఎం చంద్రబాబుని ఆడిపోసుకుని టీడీపీ ఎలా గెలుస్తుందని నిలదీసింది. అయితే ఆ వెబ్ సైట్ అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. కానీ ఉక్రోషం పట్టలేక ఏమో గానీ ఈ సర్వే చేసింది టీడీపీ అనుకూల సంస్థ అని కూడా ఆడిపోసుకుంది. అక్కడే ఆ గొప్ప వెబ్ సైట్ పప్పులో కాలేసింది.
తాజా సర్వే ఫలితాలు ప్రకటించిన వీడీపీ అసోసియేట్స్ సర్వే సంస్థ ఎప్పటినుంచో ఈ తరహా సర్వే లు చేస్తోంది. తాజా సర్వే లో ఏపీ గురించి చేసిన సర్వే ఫలితాల్లో 47 % ఓట్లతో టీడీపీ,బీజేపీ కూటమి తిరిగి విజయం సాధిస్తుందని తేల్చింది. 40 % ఓట్లతో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని సర్వే గణాంకాల్లో తేలింది. ఇక విభజన పాపం మోస్తున్న కాంగ్రెస్, కొత్త రాజకీయం చేస్తానంటున్న జనసేన సైతం కేవలం 3 % ఓట్లకే పరిమితం అని వీడీపీ సర్వే తేల్చింది. అయితే ఆ గొప్ప వెబ్ సైట్ చెప్పినట్టు ఇది టీడీపీ అనుకూల సంస్థ అనుకోవడం భ్రమ. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. వైసీపీ కళ్ళజోడు పెట్టుకుని చూసి అది టీడీపీ సంస్థ అనుకుంటే నష్టపోయేది ఎవరో అందరికీ తెలుసు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూసి వాస్తవాలు జీర్ణం చూసుకుని వ్యూహాలు మార్చుకుంటే వైసీపీ కి కనీస మర్యాద అయినా దక్కుతుంది. లేదా 2014 ఫలితాలే 2019 లోను ఎదురు అవుతాయి. ఇక అప్పుడు 2024 లో అధికారం మనదే అని చెప్పుకుంటూ వైసీపీ నేతలు తిరగాల్సివుంటుంది.