సూర్య-44 షూటింగ్ అండమాన్‌లో భారీ యాక్షన్‌తో ప్రారంభం…

Surya-44 shooting begins in Andaman with huge action
Surya-44 shooting begins in Andaman with huge action

ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య తన 44వ చిత్రాన్ని చేయనున్నాడు. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అందించింది.

Surya-44 shooting begins in Andaman with huge action

సూర్య-44 అనే తాత్కాలిక టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల వీడియో ద్వారా ప్రకటించింది. ఇందుకోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. సినిమా ప్రధాన కథాంశం ప్రేమ, నవ్వు మరియు యుద్ధం చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో భారీ తారాగణం కనిపించనుంది.