65 మిలియన్ వ్యూస్ లతో “సూర్య44” లేటెస్ట్ ప్రోమో!

"Surya44" latest promo with 65 million views!
"Surya44" latest promo with 65 million views!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి కంగువ మూవీ లో కనిపించనున్నాడు . డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ తరువాత సూర్య చేయబోయే ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య ఒక మూవీ ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సూర్య 44 అనే టైటిల్ ని తాత్కాలికంగా పెట్టడం జరిగింది. సూర్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్ ఫుల్ ప్రోమో ని విడుదల చేయడం జరిగింది.

"Surya44" latest promo with 65 million views!
“Surya44” latest promo with 65 million views!

సూర్య చాలా అగ్రెసివ్ గా ఈ ప్రోమోలో కనిపిస్తున్నారు . ఈ ప్రోమో కు ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తుంది . ఇప్పటి వరకూ ఈ వీడియోకి 65 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ మూవీ ప్రోమో కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ని అందుకోలేదు. ది వన్ సూర్య కు ఫ్యాన్స్ మంచి గిఫ్ట్ అందించారు. ఈ మూవీ కు సంబందించిన టైటిల్ టీజర్ త్వరలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ కు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి .