విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 5న భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేసేందుకు నిర్మాత సిద్దం చేశాడు. అయితే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కడంతో పాటు టైటిల్‌గా నోటా అంటూ పెట్టిన కారణంగా సినిమా విడుదలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హంగామా నెలకొంది. నోటా సినిమా విడుదల అయితే ఓటర్లు ప్రభావితం అయ్యి నోటాకు ఓటు వేసే అవకాశం ఉందనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని వారు ఈసీ ముందుకు కూడా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తొస్తోంది. ఒకవేళ ఈసీ తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేస్తే మాత్రం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే నోటా చిత్రంకు ఎన్నికలకు సంబంధం ఏంటని, అసలు ఇందులో ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రంతో ఓటర్లలో చైతన్యం కలుగుతుందని ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకుల విమర్శల నేపథ్యంలో సినిమా నుండి కొన్ని సీన్స్‌ను తొలగించేందుకు నోటా చిత్ర యూనిట్ సభ్యులు ఓకే చెప్పారు.