దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ఏక్తా కపూర్, మంచు లక్ష్మీ, మహేశ్ బాబు వంటి స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి’ అని సూచించింది. డబుల్ మాస్క్ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా అని పేర్కొంది.