నగరంలోని స్విగ్గి ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టనుననారు. ఈ మేరకు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్.. పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతోంది. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చింది యూనియన్. ఒకవేళ స్విగ్గి యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.
డెలివరీ కనీస చార్జి రూ. 35గా ప్రకటించాలి.ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ. 6 నుంచి రూ. 12కు పెంచాలి.నెల రేటింగ్స్ కి 4000 బోనస్ ఇవ్వాలి. కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చార్జీ రూ.5లను పునరుద్ధరించాలి.డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్ జోన్స్ తీసేయాలి.స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెవివరీ నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో ముందుగానే స్విగ్గీ బాయ్స్ సమ్మెకు దిగారు. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామంటున్నారు.