Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ చాలా నెలల క్రితమే ప్రారంభం అయ్యింది. అయితే రెగ్యులర్ షూటింగ్‌ను అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సైరా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఒక ప్రత్యేక సెట్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించడం జరిగింది. ఖైదీ నెం.150 చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను అత్యంత అద్బుతంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను చేయడం జరిగింది.
నేడు సైరా షూటింగ్ మొదటి షాట్‌ను చిరంజీవి మరియు బ్రహ్మాజీలపై చిత్రీకరించడం జరిగింది. చిరంజీవి మరియు బ్రహ్మాజీల లుక్ చాలా బాగుందని, ఇద్దరి మద్య కొన్ని ఆసక్తికర షాట్స్‌ను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. నేడు ఉదయం 7 గంటల సమయంలో లాంచనంగా చిత్రీకరణ షురూ చేశారు. మొదటి షెడ్యూల్‌ను పది రోజులు జరుపనున్నారు. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని లొకేషన్ చేంజ్ చేయనున్నారు. చిత్రీకరణ ఆలస్యం అయిన కారణంగా ఎక్కువ బ్రేక్ లేకుండా రెగ్యులర్ షూటింగ్‌ను జరపాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
2018 చివర్లో విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఈ చిత్రంలో అమితాబచ్చన్ నటించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్‌లు నటించబోతున్నారు. ఇక హీరోయిన్‌గా నయనతార నటించబోతుంది. వీరు కాకుండా ఇంకా పలువురు స్టార్స్ కూడా ఈ చిత్రంలో సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి సైరా మొదలు అవ్వడంతో మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.