మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా నరసింహారెడ్డి` గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో గాంధీ జయంతి సెంటిమెంటు వసూళ్లకు బాగానే కలిసొచ్చింది. తొలిరోజు ఓపెనింగులు అదిరిపోయాయి. అలాగే మెగా స్టార్ మేనియా కొనసాగి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా 80 కోట్ల షేర్ వసూలైంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 50కోట్ల మేర షేర్ వసూలవ్వడం చర్చకు వచ్చింది. ఇక అమెరికాలో ప్రీమియర్లు కలుపుకుని ఇప్పటికే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. అంటే 7కోట్లు వసూలు చేసింది.
అయితే రెండో రోజు మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు అమెరికాలోనూ వసూళ్లలో డ్రాప్ కనిపించింది. దానికి కారణాలు అనేకం. తొలిరోజు ఊపు వేరు అనుకుంటే గురువారం తెలుగు రాష్ట్రాల వరకూ ఓకే కానీ ఓవర్సీస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తోంది. గురువారం నాడు కేవలం 125-140కె డాలర్లు మాత్రమే వసూలైంది. మంగళవారం-857కె డాలర్లు.. బుధవారం-284కె డాలర్లు.. గురువారం -125కె డాలర్లు మాత్రమే వసూలైందని తెలుస్తోంది. ఓవరాల్ గా 1.2 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలైంది.
దీనిని బట్టి అన్ని సినిమాల్లానే సైరాకు డ్రాప్స్ తప్పలేదని అర్థమవుతోంది. అయితే ఈ శని-ఆదివారాలు తిరిగి జనాల్ని థియేటర్లకు రప్పించే వీలుంది. పైగా మెగాస్టార్ కి ఉన్న ఛరిష్మా దృష్ట్యా తిరిగి విదేశాల్లోనూ కలెక్షన్ల రేంజు పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. రంగస్థలం- భరత్ అనే నేను చిత్రాలు 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. బాహుబలి 2 రేంజు(10 మిలయిన్ డాలర్లు) కాకపోయినా.. సైరా నరసింహారెడ్డి 3 మిలియన్ డాలర్ క్లబ్ అందుకుని అంతకుమించి అమెరికాలో వసూలు చేస్తుందా లేదా? అన్న ఆసక్తి నెలకొంది. సోమవారం నాటికి కానీ పూర్తి క్లారిటీ తో రిపోర్ట్ అందదు. రెండో రోజు డ్రాపైనా పాజిటివ్ రివ్యూల వల్ల మూడో రోజు నుంచి కలెక్షన్లలో జోరు పెరుగుతుందేమో చూడాలి.