నిన్న రాయపూర్ లో భారత్ మరియు ఆస్ట్రేలియా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డును సాధించి చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్ లో గైక్వాడ్ పరుగులు చేయగా ఈ ఘనతను అందుకోవడం విశేషం. దీనితో భారత్ తరపున టీ-20లలో చాలా వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ రికార్డును ఋతురాజ్ గైక్వాడ్ 116 ఇన్నింగ్స్ లలో సాధించడం గమనార్హం. ఇక గైక్వాడ్ తర్వాత KL రాహుల్ ఈ ఘనతను సాధించారు.
కానీ రాహుల్ గైక్వాడ్ కన్నా ఒక్క ఇన్నింగ్స్ ను ఎక్కువగా తీసుకున్నాడు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే వెస్టాండీస్ కు చెందిన లైఫ్ హ్యాండెడ్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతను కేవలం 107 ఇన్నింగ్స్ లలోనే 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ కేవలం 174 పరుగులకే పరిమితం కావడంతో గెలుపుపై అంచనాలు చాలా తక్కువ అని చెప్పాలి. కానీ భారత్ బౌలర్లు ధాటికి ఆసిస్ ఓటమి చవిచూసింది.