టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ

టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ

అతి తక్కువ కాలంలో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ పన్ను. తన సినిమాల్లో మహిళ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ మరోవైపు విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో స‌డ‌న్‌గా బాలీవుడ్‌కు మ‌కాం మార్చిన తాప్సీ.. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో పాటు స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టిస్తూ బిజీబిజీగా మారారు.

ప్రస్తుతం ఆమె ‘రష్మి రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోక‌స్ పెడుతూ ప్రత్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు పెద్దగా జిమ్‌లో గడపని ఆమె..ఈ చిత్రం కోసం ప్రత్యేక కసరత్తులు నేర్చుకున్నారు.