బన్నీ నటించిన హిట్ చిత్రాల్లో అల వైకుంఠపురములో ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌పై కన్నేసిన బాలీవుడ్ హిందీ రీమేక్ తీయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే! యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా ‘షెహజాదా’ అన్న టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు.
తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రోహిత్ ధావన్ డీల్ చేస్తున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ 4న రిలీజ్ కానుంది.
తాజాగా హీరో కార్తీక్ దర్శకుడు రోహిత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రోహిత్‌తో పనిచేయడం చాలా బాగుంది అని రాసుకొచ్చాడు. దీనికి టబు రిప్లై ఇస్తూ.. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీయాలి అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. మీ సినిమాను మేము ఎంతో ప్రేమతో తీస్తున్నాం అని బదులిచ్చాడు.