బుల్లి తెరపై మిల్కీ బ్యూటీ

బుల్లి తెరపై మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ‘లెవన్త్‌ అవర్‌’, డిస్నీ హాట్‌ స్టార్‌లో ‘నవంబర్‌ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ల్లో నటించి డిజిటల్‌ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్ర‌ముఖ టీవీ ఛానెల్ కోసం హోస్ట్‌గా మార‌నుందట‌. ‘మాస్టర్ చెఫ్’ తరహాలో ఓ షోని ప్లాన్ చేయ‌గా, ఈ షోకి త‌మ‌న్నా జడ్జ్‌గా ఉంటుంద‌ని, ఇప్ప‌టికే సైన్ చేయ‌డం కూడా అయిపోంద‌ని వినికిడి. త్వరలోనే దీనికి సబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్‌ 3, సీటీమార్‌, మ్యాస్ట్రో చిత్రాలతో పాటు గుర్తుందా శీతాకాలం అనే మూవీలో కూడా నటిస్తోంది.