‘ఎన్టీఆర్‌’లో తమన్నా… పాత్ర ఏంటంటే…?

Tamanna Role in NTR Biopic

క్రిష్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెండు భాగాలుగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు సినీ, రాజకీయ రంగంలో విశేషమైన గుర్తింపు ఉండడంతో ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’గా రాబోతుంది. ఎన్టీఆర్‌ సినీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తు పాత్రను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అందుకు భారీ తారాగాణం ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌తో చాలా చిత్రాల్లో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. తాజాగా అందుకు సంబందించిన స్టిల్‌ కూడా విడుదల చేశారు.

tamanna-movies

ఎన్టీఆర్‌తో తెరపై రొమాన్స్‌ చేసిన హీరోయిన్లలో పలువురి పాత్రను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తాజగా ఎన్టీఆర్‌తో చాలా చిత్రాల్లో రొమాన్స్‌ చేసిన జయప్రద పాత్రను కూడా చిత్రీకరిస్తున్నారు. జయప్రదగా మిల్కీబ్యూటీ తమన్నా కనిపించబోతుంది. ఎన్టీఆర్‌, జయప్రదల కాంభోలో పలు హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల సన్నివేశాలను కొన్ని ఈ చిత్రంలో బాలయ్యబాబు, తమన్నాల మధ్య చిత్రీకరిస్తున్నారు. నటీనటుల ఎంపిక ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతుందని చెప్పవచ్చు. భారీ తారాగాణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ntr-bio-pic