ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా. హిట్ అయినా… ఫట్అయినా 100% లవ్‌తో తన స్టయిల్‌లో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. హ్యాపీడేస్ మూవీతో విజయాన్ని అందుకోవడమే కాదు..లంగావోణీలో కుర్రకారు గుండెల్లో సెటిల్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్న సినిమాల్లోనూ తన సత్తాను చాటుకుంటోంది.
సంతోష్ భాటియా, రజనీ దంపతులకు 1989 డిసెంబర్ 21న ముంబైలె జన్మించింది తమన్నా ఆమె తండ్రి డైమండ్ వ్యాపారవేత్త. తమన్నాకు ఆనంద్ అనే అన్నయ్య కూడా ఉన్నారు. 15 ఏళ్లకే ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్ చిత్రంతో 2005లో కథానాయికగా బిగ్‌స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. 2006లో విడుదలైన ‘కేడీ’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి ఉన్న తమన్నా స్పెప్పులతో ఇరగదీస్తుంది. ముఖ్యంగా ‘జై లవకుశ’లోని ‘స్వింగ్ జరా’, ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో డాంగ్ డాంగ్ లాంటి స్పెషల్ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌నుఫిదా చేసింది. టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ బాహుబలిలో అవంతిక పాత్రతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
వరుస పరాజయాలు వెక్కిరించినా.. ఒటమి ఎదురైన చోటే విజయాన్ని దక్కించుకున్న హీరోయిన్ తమన్నా. అలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ మూవీతో భారీ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ అగ్రహీరోల అందరి సరసన చాన్స్ కొట్టేసింది. నాగార్జున, రాం చరణ్ తేజ, రామ్, ప్రభాస్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితర నటులతో నటించింది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్’, ‘బద్రినాథ్’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, తడాఖా, ‘బాహుబలి’, ‘ఊపిరి’, ‘ఎఫ్2’ ‘సైరా’ లాంటి మూవీల్లో తమన్నా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇటీవలే గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమాతో హిట్ అందుకుంది తమన్నా. అలాగే యంగ్ హీరో సత్య దేవ్ నటిస్తున్న గుర్తుందా శీతాకాలం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు ఓటీటీలో కూడా తమన్నా విజయాన్ని అందుకుంది. తమన్నా లీడ్ రోల్‌లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లింగ్ తెలుగు వెబ్ సిరీస్ లెవన్త్ అవర్`కు మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే హిమ్మత్‍వాలా బాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా మరెన్నో హిందీ సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకుంది.