బాక్సింగ్ రింగులో బాక్సర్‌గా ఫైట్ చేసేందుకు రెడీ అయ్యారు తమన్నా. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘బబ్లీ బౌన్సర్’ చిత్రంలోనే తమన్నా బాక్సర్‌గా కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘‘బాక్సర్ టౌన్‌గా పేరుగాంచిన ఫతేపూర్ బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా కనిపిస్తారు. దేశంలో తొలిసారి ఓ మహిళా బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ఇదేనని అనుకుంటున్నాం’’ అన్నారు మధుర్ బండార్కర్.
‘‘కెరీర్‌లో తొలిసారి బౌన్సర్ పాత్రలో కనిపించనుండటం హ్యాపీగా ఉంది. ఓ చాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమాను అంగీకరించాను. ఈ సినిమాతో ప్రేక్షకులు నన్ను మరింతగా ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు తమన్నా. అయితే కథ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది కాబట్టి ఈ చిత్రంలో బౌన్సర్ నుంచి ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదిగే పాత్రలో తమన్నా కనిపిస్తారని బీ టౌన్ టాక్.