ప్రియుడితో కలిసి ఈవెంట్లో సందడి చేసిన తమన్నా.

ప్రియుడితో కలిసి ఈవెంట్లో సందడి చేసిన తమన్నా.
Latest News

తక్కువ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ల సరసన నటించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరుస అవకాశాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సినిమా ల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఓటీటీలో సందడి చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే చివరిసారిగా ఓటీటీలో లస్ట్ స్టోరీస్ 2 అనే మూవీ లో నటించింది. ఇందులో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో కూడా నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది .

ప్రియుడితో కలిసి ఈవెంట్లో సందడి చేసిన తమన్నా.
Thamanna Bhathiya

శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ తమన్నా. ఈ మూవీ తర్వాత చాలా కాలం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీ తో మిల్కీబ్యూటీకి బాగా క్రేజ్ వచ్చింది. ఈ మూవీతో తెలుగులో అవకాశాలు కూడా క్యూకట్టాయి.

ఇద్దరు కలిసి అనేక ఈవెంట్స్, పార్టీలలో కలసి పాల్గొనడంతో వీరి డేటింగ్ విషయం బాలీవుడ్ మీడియాపై విరుచుకు పడింది . ఇక లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్లలో తమ ప్రేమ గురించి బయటపెట్టేసింది తమన్నా. తాజాగా వీరిద్దరు కలిసి ముంబైలో ఒక వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. పర్పుల్ కలర్ ట్రెండీ డ్రెస్ లో మరింత స్పెషల్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ తమన్నా. ఇంటర్నేషనల్ బ్రాండ్ స్మిత్ డిజైన్ చేసిన మాక్ నెక్ గౌను ధరించింది. ఈ డ్రెస్ ధర $2.550. అంటే భారతీయ కరెన్సీలోకి మారిస్తే..దాదాపు రూ.2,06,399. మెటాలిక్ గ్రేప్ అవుట్‌ఫిట్ లో తమన్నా మరింత అందంగా కనిపిస్తున్నప్పటికీ ఆ డ్రెస్ ధర తెలిసి అవాక్కవుతున్నారు ఇప్పుడు ఉన్న నెటిజన్స్.