బాలీవుడ్‌లో తమిళ సూపర్‌ హిట్‌ రీమేక్‌

తమిళ సూపర్‌ హిట్‌ 96 చిత్రం క్లాసిక్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రిష, విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ పోషించారు. 2018లో విడుదలైన 96మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని జానుగా రీమేక్‌ చేయగా, సమంత, శర్వానంద్‌ లీడ్‌ రోల్స్‌ పోషించారు. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత అజయ్‌ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇక ఈ రీమేక్‌ చిత్రానికి సంబంధించి దర్శకుడు, నటీనటులు ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.