ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కి ఏపీ భవన్‌లో ఘోరమైన అవమానం జరిగింది. కాగా సీతారాం తన సతీమణితో కలిసి డెహ్రాడూన్ వెళ్లి, గత శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. ఈమేరకు స్పీకర్ తమ్మినేని తన కుటుంబం తో సహా బస చేయడానికి స్వర్ణముఖి బ్లాకులోని 320 గెస్ట్ రూమ్ కేటాయించారు. అయితే ఆ మరుసటి రోజు ఆదివారం నాడు సాయత్రం ఏపీకి చేరుకోడానికి సన్నద్ధమయ్యారు. ఈలోగా ఆ వసతి గృహ సిబ్బంది ఒకరు వచ్చి సీతారాం కి సంబందించిన భోజన, వసతి బిల్లు కట్టమని చెప్పారు. ఈమేరకు ఒక పుస్తకంపై సంతకం కూడా చేయాలనీ ఆ సిబ్బంది కోరారు. దీంతో షాకైన తమ్మినేని, ఒక రాష్ట్రానికి స్పీకర్ ని అయిన నేను బిల్లు కట్టడం ఏంటని అక్కడి అధికారులను ప్రహనించారు.
అయితే తమ్మినేని ప్రశ్నకు బదులుగా… తమకు బస చేయడానికి కేటాయించింది కేటరిగీ 1 కింద అని, అయితే తమకు స్టేట్ గెస్ట్ గా ఏర్పాటు చేయాల్సింది అని అధికారులు సమాధానం చెప్పారు. అయితే ఈ విషయంలో ఆగ్రహించిన తమ్మినేని మొదటగా బిలు కట్టమని, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటానని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయంలో ఆయన సతీమణి వాణి ఆగ్రహంతో ‘డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దాం. మనకు అవమానం జరిగింది. స్పీకర్‌గా ఈ అధికారులు గౌరవించలేదు’ అని ఆవేదన చెందారు అని సమాచారం.