అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పై ఆల్రెడీ మంచి బజ్ నెలకొనగా ఈ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఫస్ట్ సింగిల్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇలా ఇప్పుడు వరకి మొత్తం మూడు సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మూడు సాంగ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ హిట్ గా నిలిచాయి అని చెప్పాలి. బుజ్జితల్లి, నమో నమః అలాగే లేటెస్ట్ గా హైలేసా సాంగ్స్ వచ్చిన వెంటనే మంచి టాక్ ను ఆడియెన్స్ నుంచి అందుకొని శ్రోతల మెప్పు పొందాయి. ఇలా మూడు కూడా మంచి చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యి మూడూ సిక్సర్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు . అలాగే బిగ్స్ స్క్రీన్స్ పై ఈ ఫుల్ సాంగ్స్ కోసం కూడా అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ కి గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కు రాబోతుంది.