‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమమై తాప్సీ పన్ను కొద్ది రోజులకు బాలీవుడ్‌కు మాకాం మార్చారు. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఇటీవల ఆమె నటిచిన థప్పడ్(చెంపదెబ్బ) సినిమాలో తన పాత్రకు విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం తాప్సీ ‘రష్మి రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా తాప్సీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో తాప్సీ అథ్లెట్ దుస్తులు ధరించి మైదానంలో పరుగులు తీస్తూ.. కసరత్తులు చేస్తున్నారు. అవి చూసిన కొంతమంది నెటిజన్లు తాప్సీని ట్రోల్ చేయడం ప్రారంభించారు.
‘సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తున్నావు తప్ప నీలో అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఫాల్తు హీరోయిన్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు. అది చూసిన తాప్సీ ట్రోలర్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘అసలు చూపించడం అంటే ఏంటి? ఇంతకి నేను ఏం చూపించానో తెలుసా నా ప్రతిభను. కానీ నీకు అది కనిపించదు’ అంటూ చురకలు అంటించారు. అయితే తాప్సీ ‘రష్మి రాకెట్’తో పాటు ‘లూప్ లపేట’, ‘హసీన్ దిల్‌రూబా’లో నటిస్తున్నారు. కాగా స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ‘రష్మి రాకెట్’ కోసం తాప్సీ అథ్లెట్‌లా కనిపించేందుకు గ్రౌండ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తున్నారు.