తారక్, బన్నీ ఒకే ఫ్రేమ్ లోకి వస్తున్నారా …?

Tarak and Bunny are coming in the same frame...?
Tarak and Bunny are coming in the same frame...?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి ఉన్నటువంటి పాన్ ఇండియా హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు కూడా ఒకరు. మరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు తమ భారీ మూవీ లు “దేవర” (Devara), “పుష్ప 2” (Pushpa 2) మూవీ ల్లో నటిస్తుండగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకోసారి చేసే హంగామా ఫ్యాన్స్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ను తీసుకొస్తుంది. ఇలా ఇద్దరూ కూడా చాల బాగా బావ అని పిలుచుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానం కనబరుస్తారు.

Tarak and Bunny are coming in the same frame...?
Tarak and Bunny are coming in the same frame…?

అయితే ఈ ఇద్దరి బిగ్ స్క్రీన్ పై ఇంకా కలిసి కనిపించలేదు కానీ పలు ఫంక్షన్స్ లో మాత్రం ఓకే ఫ్రేమ్ లో కనిపించిన ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కలయిక కనిపించే అవకాశం కూడా ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వస్తున్నా తాజా మూవీ “ఆయ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే ఈ ఇద్దరు స్టార్స్ ను తీసుకురావాలని మేకర్స్ ట్రై చేస్తున్నారట. సో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఇద్దరు కలిసి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని చెప్పుకోవాలి . మరి దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది.