ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాల హవా కనిపిస్తుంది. బాహుబలితో రీజినల్ సినిమాలకు కూడా జాతీయ స్థాయిలో మార్కెట్ ఓపెన్ కావటంతో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టారు. ఈ జనరేషన్ యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడట.
అరవింద సమేత వీర రాఘవ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది.
ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు తారక్. అరవింద సమేత సూపర్ హిట్ కావటంతో మాటల మాంత్రికుడితో మరో సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్‌కు కూడా ఎన్టీఆర్‌తో మరో సినిమా చేసే ఆలోచన ఉంది. అందుకే ఈ సారి తారక్‌తో పాన్ ఇండియా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్‌కు జాతీయ స్థాయిలో ఇమేజ్ వస్తుంది కాబట్టి ఆ ఇమేజ్ను క్యాష్ చేసుకుంటూ భారీ బడ్జెట్ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు మాటల మాంత్రికుడు.
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాను కూడా అదే స్థాయిలో చేయాలని ప్లాన్ చేశాడు. అందుకే ముందుగా అనుకున్న కథనే స్కేల్ పెంచి భారీ బడ్జెట్‌తో సాహోగా రూపొందించాడు. అయితే ప్రభాస్ ప్లాన్ ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమాకు భారీగా నష్టాలు రాకపోయినా సూపర్ హిట్ అన్న టాక్ మాత్రం రాలేదు. దీంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు డార్లింగ్.
ఓ భారీ చిత్రం తరువాత మరో పాన్ ఇండియా సినిమా చేసిన ప్రభాస్ ఫెయిల్ అయ్యాడు. మరి ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత మరోసారి అదే స్థాయిలో సినిమా చేస్తే తారక్ సక్సెస్ అవుతాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. త్రివిక్రమ్ గ్రాఫ్ కూడా ఆ స్థాయిలో లేకపోవటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఓ మంచి కమర్షియల్ సినిమా చేస్తే తారక్ తెలుగులో టాప్ చైర్‌కు మరింత చేరువవుతాడు. కానీ అలాంటి సమయంలో పాన్ ఇండియా సినిమా చేయటం రిస్క్ అని భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.