టౌటే తుఫాను ప్రభావంతో ఎడతెరపి లేకుండ కురుస్తున్న వర్షంతో ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు భయాందోళనగా మారాయి. ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ వర్షం ప్రభావంతో ఓ ఇల్లు ఆ కుటుంబమంతా మృత్యువాత పడింది. అయితే ఆ కుటుంబంలోని ఇద్దరు బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న తల్లి అఫ్సానా, ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడు దుర్మరణం చెందారు. ఇంటి పైకప్పు వారిపై పడడంతో శిథిలాల కింద వారు శవాలుగా తేలారు.
సమాచారం అందుకున్న వెంటనే చేరుకున్న పోలీసులు వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లోని తండ్రి, మరో కుమారుడు బయటకు వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.