లివర్‌పూల్ నగరంలోని మహిళా ఆసుపత్రి వెలుపల జరిగాన కారు పేలుడులో ఒకరు మృతి చెందారని, పైగా ముగ్గురు వ్యక్తలను అదుపులోకి తీసుకునిన విచారిస్తున్నామని ఉగ్రవాద నిరోధక అధికారులు వెల్లడించారు. అంతేకాదు కారులోని ఒక ప్రయాణికుడు సంఘటన స్థలంలోనే మరణించాడని, డ్రైవర్ గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఆ ముగ్గురు వ్యక్తులను నగరంలోని కెన్సింగ్‌టన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని తీవ్రవాద చట్టం కింద అరెస్టు చేసినట్లు ఉగ్రవాద నిరోధ పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో చీఫ్ కానిస్టేబుల్ సెరెనా కెన్నెడీ మాట్టాడుతూ…తాము సమీపంలోని లివర్‌పూల్ కేథడ్రల్‌లో రిమెంబరెన్స్ డే సర్వీస్ సందర్భంగా యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటున్న సమయంలోనే ఈ సమాచారం అందడంతో వెంటనే తాము స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు.అంతేకాదు తాము స్థానిక పోలీసుల మద్ధతుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఏం జరిగిందనే విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాన్ని తెలయజేస్తామంటూ ఉగ్రవాద నిరోధక అధికారులు వెల్లడించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటమే కాక ఎప్పటికప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ప్రతి విషయాన్ని స్వయంగా సమీక్షిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. అయితే ఈ పేలుడును పోలీసులు ఉగ్రవాద ఘటనగా ప్రకటించకపోవడం గమనార్హం.