ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ విద్యార్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ‘ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్’గ్రామ్ కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అవకాశం కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
తేదీలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది.ఇక ఎంపికైన అభ్యర్థులు వారి అర్హతలను బట్టి జీతం పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్‌లు సంవత్సరానికి రూ.7 లక్షలు పొందుతారు. అయితే వారి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సంవత్సరానికి రూ.7.3 లక్షల జీతం పొందవచ్చు.