ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ బాబాయ్ మాజీ మంత్రి వివేకా హత్య రాజకీయాలలో సంచలనం రేపింది. అప్పట్లో ఆ హత్యను వైసీపీనే చేయించిందంటూ టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. అయితే వివేక హత్యకు గురై చాలా రోజులు అవుతున్న పోలీసులు ఇప్పటికి ఆ హత్య కేసును చేధించలేకపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పచెప్పింది. అయినా కూడా ఈ కేసు ఒక కొల్లిక్కి తీసుకురాలేకపోయారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది.
అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఈ హత్యకు సంబంధించిన దోషులు ఎవరో ప్రభుత్వం ఇంకా బయటపెట్టలేకపోయింది. అయితే దీనిపీ ప్రతిపక్షాలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపధ్యంలో ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని జగన్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే తాజాగా ఈ కేసుపై దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో సహా, మరో పదిమందిని మరియు టీడీపీ నేత శివరామి రెడ్డిని కూడా పిలిచి విచారించారు. ఈ హత్యకు సంబంధించి అనుమానితులను మరో పది రోజులు విచారిస్తామని నింధితులెవరనేది త్వరలోనే తేలుస్తామని,హత్యకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని ఎస్పీ అన్సురాజన్ వెల్లడించారు. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 300మందికి పైగా సిట్ విచారించింది.