టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.