చంద్రబాబు వారెంట్స్….టీడీపీ నేతల కామెంట్స్ !

TDP Leaders Comments on ChandraBabu warrants

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు ఆయనకు వారెంట్ లు జారీ చేయడం బీజేపీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఈరోజు టీడీపీ నేతలు ఇచ్చిన ప్రెస్ మీట్ స్టేట్మెంట్స్.

మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు :

ex tdp mp nama nageswara rao

‘బీజేపీ కావాలనే కుట్రలు చేస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సమయంలో బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినప్పడు …. తెలంగాణ సరిహద్దులోనే మమ్మల్ని అరెస్ట్ చేశారు.  బాబ్లీ చూపించబోం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా మహిళా నేతల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు. ఒకే గదిలో 80మంది నేతలను బంధించారు. ఆ రోజు రాత్రి అక్కడ నరకం అనుభవించాం. మంచినీళ్లు కాదుకదా… టాయ్‌లెట్లు లేవు. మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎనిమిదేళ్ల తర్వాత వారెంట్ జారీ చేయడం దారుణం. బీజేపీ కుట్రకు ఇది నిదర్శనం. బాబ్లీ కేసులో నాకు ఇంతవరకూ ఒక్క నోటీసు కూడా రాలేదు’ అని అన్నారు.

పెద్దిరెడ్డి

tdp mp peddi reddy

నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌పై న్యాయపరంగా ఎదుర్కొంటామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా వారెంట్‌ను రద్దు చేసి, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  బీజేపీ ప్రభుత్వం చొరవతోనే చంద్రబాబుకు వారెంట్ జారీ చేశారని అన్నారు. మహాకూటమికి భయపడి కేసీఆర్, మోదీ కుమ్మక్కు అయ్యారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అలాగే గత ఎనిమిదేళ్లలో ఎలాంటి నోటీసులు పంపలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్పందించాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఈ నెల 23న ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమంలో ప్రసంగించబోతున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యలో ఓ ముఖ్యమంత్రి తన స్థాయి కంటే ఎక్కువగా ఎదగడం ఇష్టం లేకపోవడంతోనే ప్రధాని మోదీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది పక్కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని ఆరోపించారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన మోదీ ఇతరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి :

tdp mp chandramohan reddy

బాబ్లీ ప్రాజెక్టు ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల మేలు కోసం ప్రజా ఉద్యమాలు చేస్తే… నోటీసులు ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సహా తనకు గిట్టని వారందరికీ మోదీ ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని అన్నారు. 24 గంటల్లో కేసును వాపసు తీసుకోవాలని… లేకపోతే తామేంటో చూపిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు. బీజేపీ ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని అన్నారు. తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారంటూ విమర్శించారు.

వర్ల రామయ్య :

tdp mp varla ramaiah

దేశంలో ప్రస్తుతం జర్మనీ నియంత హిట్లర్, పాక్ సైనిక నియంత ఆయూబ్ ఖాన్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయకత్వంలో తామంతా బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లామనీ, ఆందోళన చేపట్టామని వెల్లడించారు. ఈ విషయంలో తెలంగాణ వాదిగా తనను తాను చెప్పుకునే కేసీఆర్ ఎందుకు మౌనం వహించారని వర్ల రామయ్య ప్రశ్నించారు.  ఇలాంటి ప్రతీకార రాజకీయాలు చేపడితే బీజేపీ దేశంలో ఎక్కడా మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఈగ వాలినా ఊరుకోబోమనీ, జరిగే నష్టానికి బీజేపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.

పరిటాల సునీత :

tdp mp paritala sunitha

బాబ్లీ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిపై పెద్ద కుట్ర జరుగుతుంది. ఎనిమిదేళ్ల తరువాత బాబ్లి కేసును అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు గారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమే. రైతుల పక్షాన పోరాడిన చంద్రబాబు నాయుడు గారిపై కావాలనే మోడి, జగన్ లు కక్ష కట్టారు. బాబ్లి ప్రాజెక్టు వద్ద ఆరోజు మమ్మల్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. అయినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశాం, బలవంతంగా హెలికాఫ్టర్ వెక్కించి వెనక్కి పంపారు. కేసులన్నీ ఎత్తేశాం అని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోజు చెప్పింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు గారిపై ఈ విధంగా కుట్ర పన్నారు.

ప్రత్తిపాటి పుల్లారావు :

tdp mp pathipati pullarao

2010 లో రైతులకు అన్యాయం జరుగుతుందని పక్క రాష్ట్రంపై పోరాటం చేసిన యోధుడు చంద్రబాబు. మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఎంతో కఠినంగా వ్యవహరించిన వెనక్కి తగ్గలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమే పుల్లారావు. కేంద్రంలో ఉన్న మోడీ, జగన్, తెలంగాణా సీఎం కలిసి చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. ఐక్యరాజ్యకమిటీలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించే అవకాశం చంద్రబాబుకు రావటంపై తట్టుకోలేకపోతున్నారు. నాన్ బెయిల్‌బుల్ కేసు గరుడ ఆపరేషన్‌లో భాగమే. చట్ట విరుద్ధంగా నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడం చరిత్రలో లేదు. దేశానికి ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ అయింది. కుట్రలను చేదించే శక్తి చంద్రబాబుకు ఉంది. మోడీని విమర్శించే వారిపై కేంద్రం ఈడీ, పోలీసులు, కేసులులను బనయిస్తున్నారు. కేసుల మాఫీకోసం జగన్ రైతుల కోసం పోరాడిన చంద్రబాబుపై స్పందించటం లేదు. డీలర్ల యొక్క కోరిక మేరక జొన్నలు, రాగులు, కందిపప్పు, పంచదారపై కమిషన్‌ను ఒక్క రూపాయికి పెంచాం. రైతుల దగ్గర నుంచి ప్రాక్యూరిమెంట్ చేసే  53 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని యక్షాన్ ప్లాన్ తయారు చేశాం.

మంత్రి కళావెంకట్రావ్

tdp mp kala venkata rao

చంద్రబాబు ప్రజాపక్షపాతి, ప్రజలకోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకోసంఆరోజు బాబు పోరాడారు. బాబ్లీ నోటీసుల పై మేం కోర్టుకు హాజరవుతాం. రాజ్యాంగపరంగా న్యాయవ్యవస్థను గౌరవిస్తాం. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటన పై ఇప్పుడు నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

ఎంపీ కేశినేని నాని :

tdp mp kesineni nani

బీపీ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు ని ఎదోరకంగా  ఇబ్బంది పెట్టాలని మోడీ చూస్తూన్నాడు. తెలంగాణలో  రైతుల కోసం చంద్రబాబు  పోరాటం చేస్తే  , 8 సంవత్సరాల తర్వాత నోటీసులు ఇవ్వడం ఏంటి ?  బాబ్లీ నిర్మాణం జరిగితే తెలంగాణ లో 6 జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆరోజూ కేసులు లేవని చెప్పి, ఇప్ప్పుడు నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేయడం ఏంటి. బీజేపీ అడుతున్న గేమ్ లో ఇది కూడా ఒక భాగమే. చంద్రబాబు పై జరుగుతున్న కుట్రను ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లు అందరూ కండిస్తున్నారు..ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబుని ఏమి చెయలేరు….ఎంపీలు మీద కుట్రలు జరుగుతున్నాయి..ఎన్ని కుట్రలు చేసిన  రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలగా   మా పోరాటం కొనసాగిస్తాం..బ్యాంక్ లు దోచుకున్న  వారికీ  లాభాలు చేకురూస్తున్నారు..చంద్రబాబు కు ఉన్న ఫేమ్ ని డీ గ్రేడ్  చేయాలని చూస్తున్నారు..కోర్టులు వాడుకోవడం  బీజేపీకి అలవాటుగా మారిపోయింది..

వినుకొండ శాసనసభ్యుడు సభ్యుడు జి వీ ఆంజనేయులు :

tdp mp gv anjaneyulu vinukonda

8 సంవత్సరాల క్రితం గోదావరి జలాల కోసం మహారాష్ట్ర లో ధర్నా చేశారు,  ఈరోజు ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ వారెంట్ జారీ చేయటం భారతీయ జనతా పార్టీ గరుడా ఆపరేషన్ లో భాగమే. ఆ రోజు గోదావరి జలాల కోసం బాబ్లీ ప్రాజెక్టు వద్ద చేసిన ధర్నా లో నేను కూడా పాల్గొన్నా.

ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ :

tdp mp chintamaneni prabhakar

బాబ్లీ కేసు మాకు వెంట్రుక వాసు లెక్క, నాకు కేసులు కొత్త కాదు, టీడీపీ ని ఎదిరించి పోరాడలేక కావాలనే బీజేపీ అక్రమ కేసులు  పెడుతోంది. ఇప్పటి వరకు బాబ్లీ కేసు గురించి నాకు తెలియదు. కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ జారి చెయ్యడం హాస్యాస్పదం. లక్ష కోట్లు తిన్న జగన్ ను ఏమి చెయ్యలేని చేతకాని ప్రభుత్వం బీజేపీ.