అమిత్ షాకు తిరుమ‌ల‌లో నిర‌సన‌ల సెగ‌

TDP leaders stop and protest against Amit Shah at Tirumala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు అమిత్ షా కి తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న శ్రీ వెంక‌టేశ్వ‌రుని ద‌ర్శ‌నార్థం ఉద‌యం తిరుమ‌ల‌కు వ‌చ్చిన అమిత్ షాకు తెలుగుదేశం శ్రేణుల నుండి  అడుగ‌డుగునా నిర‌స‌న‌లు ఎదుర‌య్యాయి.. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర టీడీపీ కార్యకర్తలు అమిత్ షా రాకను నిరసిస్తూ టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు స్థానికులు, శ్రీవారి భ‌క్తులు నినాదాలు చేశారు. అమిత్ షా వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ముందే అలిపిరి వ‌ద్ద‌కు చేరుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌చేప‌ట్ట‌గా…కాలిన‌డ‌క‌తిరుమ‌ల‌కు బ‌య‌లుదేరిన పలువురు భక్తులు కూడా వారితో జ‌త‌క‌లిశారు వారంతా కలిసి నల్ల జెండాలను ప్రదర్శించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

అప్పటికే భారీగా పోలీసులు మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సహాయంతో వారిని తప్పించుకుని అక్క‌డినుంచి అమిత్ షా తిరుమ‌ల‌కు చేరుకోగానే…అక్క‌డా భ‌క్తుల నుంచి నిర‌స‌న‌లు ఎదుర‌య్యాయి. అమిత్ షా కాన్వాయ్ వెళ్తుంటే…ర‌హ‌దారి ప‌క్క‌ఉన్న భ‌క్తులు హోదా కోసం నినాదాలు చేశారు. తిరుమ‌ల‌కు వెళ్లిన అమిత్ షాకు స్వాగ‌తం ప‌లికిన టీటీడీ అధికారులు, ప్రొటోకాల్ ప్ర‌కారం ద‌ర్శ‌ఏర్పాట్లు చేసి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. స్వామివారిని ద‌ర్శించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా అమిత్ షాను నిర‌స‌న‌కారులు అడ్డుకున్నారు.

అలిపిరి గ‌రుడ స‌ర్కిల్ ద‌గ్గ‌టీడీపీ కార్య‌క‌ర్త‌లు నల్ల‌జెండాలు ప్ర‌ద‌ర్శించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై బీజేపీ మోసం చేసింద‌ని, తిరుమ‌వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీని తుంగ‌లో తొక్కింద‌ని, మ‌ళ్లీ మొఖం పెట్టుకుని పార్టీ అధ్య‌క్షుడు తిరుమ‌లకొచ్చార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు నిల‌దీశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అమిత్ షా కాన్వాయ్ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుంటే.. రహదారి పక్కన ఉన్న పలువురు భక్తులు కూడా హోదా కోసం నినాదాలు చేయడం బీజేపీ మీద ప్రజలలో ఎంత వ్యతిరేకత నాటుకు పోయిందో అర్ధం అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు