వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఘోరమైన పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చెయ్యడం మొదలు పెట్టారు.అయితే ఈరోజు మాత్రం జగన్ చేసిన పనికి ఎన్నడూ లేని విధంగా జగన్ పై తెలుగుదేశం పార్టీ నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈరోజు ప్రతిపక్ష నేత మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు స్వస్థలం అయినటువంటి చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెకు అతి సమీపంలోనే వైసీపీ బహిరంగ సభ నెలకొల్పడం టీడీపీ శ్రేణులలో తీవ్ర కలకలం రేపింది.
అంతే కాకుండా అక్కడ ఉండేదే 100 మంది జనాభా అయితే కనీసం వారిని కూడా బయటకు రాకుండా జగన్ ప్రభుత్వం నాలుగు వందల మంది పోలీసులను తీసుకొచ్చి పెట్టారని ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇదంతా జగన్ కావాలనే చేస్తున్నారని వైసీపీ కు చెందిన మంత్రులు,వారి అడ్వైజర్లను ఇతర పార్టీ శ్రేణులకు తీసుకొచ్చి జగన్ ప్రతీకార చర్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు కీలక నాయకులు మండిపడుతున్నారు.