జీవీఎల్ మీద సభా హక్కుల నోటీసు !

TDP MLA Gives House Privilege Motion To GVL

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు టీడీపీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీ రౌడీ అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. రూల్‌ 169 కింద నోటీసును అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజేశారు. జీవీఎల్‌పై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రవణ్‌ కోరారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన జీవీఎల్ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు. అందులో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే చ్చి పీక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం అసెంబ్లీ రౌడీలాగా ప్రవర్తించారని సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన ఉందన్నారు. జీవీఎల్ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన ఉందనే చెప్పగా టీడీపీ ఏకంగా ప్రివిలేజ్ నోటీసును ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. మరి నోటీసుపై జీవీఎల్ నరసింహారావు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.